నా భర్త కొట్టడానికి కారణం ఇదే అంటూ అసలు విషయం చెప్పిన యాంకర్ లాస్య.

నా భర్త గురించి నేను ఎంతో గర్వపడుతున్నా. పర్ఫెక్ట్ హస్బెండ్. నా పిచ్చితనాన్ని క్షమించే ఏకైన వ్యక్తివి నీవు. మంజునాథ్ నీవు నన్ను నవ్వించావు. నా కన్నీళ్లు తుడిచావు. నన్ను గట్టిగా హత్తుకున్నావు. నా సక్సెస్ ను చూశావు. నా వైఫల్యాలను కూడా చూశావు. నన్ను ఎంతో బలంగా మార్చావు. లవ్ యూ’ అంటూ లాస్య తన భర్తపై ఎంతో ప్రేమను కురిపించింది. అయితే హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది.

కూల్‌ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరకు పూర్తిగా దూరమైన లాస్య.. తన ఫోకస్‌ మొత్తం సోషల్‌ మీడియాపైనే పెట్టింది. యూట్యూబ్‌ చానెల్‌ ఒపెన్‌ చేసి.. తన కుటుంబం, పిల్లలు, భర్తతో కలిసి వీడియోలు చేస్తూ.. వాటిని పోస్ట్‌ చేసేది. కాగా తాజాగా లాస్య పోస్ట్‌ చేసిన ఓ వీడియో తెగ వైరలవుతోంది. దీనిలో ఆమె తన భర్త మంజునాథ్‌ చేతిలో దెబ్బలు తింటుంది. ఈ వీడియో చూసిన వారు షాక్‌ అవుతున్నారు.

మంజునాథ్‌, లాస్యలది ప్రేమ వివాహం.. పైగా ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.. అలాంటిది మంజునాథ్‌ లాస్యను కొట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నారు. మరి ఇంతకు ఏం జరిగింది.. మంజునాథ్‌ ఎందుకు లాస్య మీద చేయి చేసుకున్నాడు అంటే.. వీరిద్దరూ నిజంగా గొడవపడలేదు. ఓ ఫన్నీ రీల్‌ చేస్తూ.. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది లాస్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *