కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 400 పైగా చిత్రాల్లో నటించింది. మరీ ముఖ్యంగా హిట్లర్, చాలా బాగుంది చిత్రాల్లో ఆమె చేసిన కామెడీని ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. అయితే కల్పన రాయ్ పేరు వినగానే.. చాలా మంది ఆమె తెలుగు నటి కాదని భావిస్తారు. అయితే కల్పనా రాయ్..ఎవరైనా బాధలో ఉన్నామని కన్నీళ్లు పెట్టుకుంటే చాలు క్షణం ఆలోచించకుండా తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చేది. అంతటి దయామయురాలు కల్పనా రాయ్. తన దానధర్మాల వల్ల ఉన్న బంగారం, ఆస్తి అంతా కరిగిపోయినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు.
అప్పు చేసైనా సరే అందరికీ భోజనం పెట్టేది. ఆ మంచితనమే ఆమెకు శాపంగా మారింది. డబ్బు పోగానే అందరూ దూరమయ్యారు. దిగులు వల్లో మరింకేదో కానీ కల్పన లావెక్కింది. ఈ నటి ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. ఒకమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆమె యుక్తవయసుకురాగానే ఒకరిని ప్రేమించి అతడితో పారిపోయింది. అప్పుడు కల్పన పడ్డ బాధ వర్ణణాతీతం. ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు తనను మోసం చేసి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోయింది. అప్పుడే ఆమె మనిషిగా సగం చనిపోయింది. ఉన్న డబ్బు కూడా ఆవిరవడంతో పలకరించే నాధుడే కరువయ్యాడు. ఒంటరిగా మిగిలిపోయింది.
చనిపోయేముందు దాదాపు పది రోజులపాటు తిండి లేక ఆకలికి అలమటించింది. తన శరీరం ఆకలికి తట్టుకోలేక హృదయ విదారక స్థితిలో ఆమె కన్నుమూసింది. ‘కల్పనా రాయ్ చనిపోయినప్పుడు ఆమె చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బుల్లేని దుస్థితికి చేరుకుంది. ఆమె అతి మంచితనం వల్ల చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయింది. ఇంతటి దుస్థితి ఏ ఆర్టిస్టుకూ రాకూడదు. కళామతల్లిని నమ్ముకున్న ఆమె చితి పేర్చేందుకు వేరేవాళ్లు డబ్బు సాయం చేస్తే కానీ ఆమె అంత్యక్రియలు జరగలేదు’ అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో కంటతడి పెట్టుకుంది నటి జయశ్రీ.