హిందూమతంలో, ప్రతి రోజు దేవునికి అంకితం చేయబడింది. సూర్య భగవానుని ఆదివారాలు కూడా పూజిస్తారు. దీనితో పాటు లక్ష్మిని కూడా పూజిస్తారు. ఆదివారం నాడు కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా, లక్ష్మీ దేవి సంతోషించి తన భక్తులను అనుగ్రహిస్తుందని నమ్ముతారు. అయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి అలవాటులకి దూరంగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం.
పండితులని జ్ఞానులని మేధావులని గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి కచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళని ఇష్టపడుతూ ఉంటుంది. మూర్ఖుల పొగడ్తలను వినడం కంటే జ్ఞానుల నిందలు వినడం చాలా ఫలితం అని చాణక్య అన్నారు. పండితులతో జ్ఞానులతో సత్సంబంధాలను కలిగి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఆహారాన్ని ఎప్పుడూ కూడా అగౌరవపరచకూడదు ఆహారాన్ని సరిగ్గా నిలువ చేసుకోవాలి. ఆహార పదార్థాలని పారేయకూడదు పాడైపోకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలను వృధా చేయని ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది.
ఆహారాన్ని అస్తమాను పాడు చేసే చోట మాత్రం దరిద్రం ఉంటుంది. భార్య భర్తల బంధం బాగున్న చోట లక్ష్మీదేవి ఉంటుంది భార్య భర్తల ప్రేమ గౌరవంతో ఉంటే కచ్చితంగా ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. చెడు స్నేహితులు కలవాళ్ళు కోపం దురాశ కలవాళ్ళు జీవితంలో ప్రతిదీ కోల్పోతూ ఉంటారు. ఉన్నత స్థితికి వెళ్లలేరు అదే విధంగా అనేక ఇబ్బందుల్ని జీవితంలో ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఇటువంటి తప్పులు చేయకుండా మంచి అలవాట్లని కలిగి ఉండండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.