క్లింకారా అనేది లలితాసహస్రనామాల్లో ఒక బీజాక్షం. ప్రకృతికి శక్తికి ప్రతిరూపం అర్థం అని.. ఆ పేరుతో ఒక శక్త, పాజిటివ్ వైబ్రేషన్ ఉందని.. ఈ లక్షణాలని మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వతంలో పెరిగేకొద్దీ ఇమడ్చుకుంటుందని నమ్ముతున్నట్లు తెలిపారు. అయితే బిడ్డను అఫీషియల్‌గా చూపించినా.. ముఖాన్ని మాత్రం చూపించలేదు.
అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతుల పుట్టిన పాపకు తాతయ్య మెగాస్టార్ చిరంజీవి పోలికలు ఉన్నట్టు చూసినవాళ్లు చెబుతున్నారుమెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబారాన్ని అంటాయి. పెళ్లైన 11 యేళ్లకు పుట్టిన బిడ్డ కావడంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు మెగా కుంటుంబంలో ఆనందం వెల్లి వెరిస్తోంది.

అటు మెగా ఫ్యామిలీ అభిమానులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్, ఉపాసనకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఓ బిడ్డకు తండ్రైన ఆనందం ఆయన కళ్లల్లో కనిపిస్తోంది. ఒక కామన్ మ్యాన్‌లా ఎంతో ఎగ్జైంటింగ్‌కు గురయ్యారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ డాక్టర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.