కుర్చీతాత అరెస్ట్. అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు. కారణం ఏమిటంటే..?

కుర్చీని మడత బెట్టి.. ఈ సాంగ్ థియేటర్లలో విడుదల కాకుండానే నెట్టింట్లోనే ట్రెండ్ అయిన సంగతి విదితమే. ఓ తాత డైలాగ్ ఆధారంగా ఆ పాటను క్రియేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తన మాటలతో సోషల్ మీడియా సెన్సేషన్ అయిన కుర్చీతాత వాడిన పదం నుండి.. తీసుకుని ఈ ఆ పాటను క్రియేట్ చేశారు. అయితే తాజాగా కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేశారని సమాచారం.

తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని.. తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని ప్రచారం చేస్తున్నాడని.. అందుకే పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పాడు వైజాగ్ సత్య. వాస్తవానికి వైజాగ్ సత్య సాయంతో తమన్‌ని కలిశాడు కుర్చీతాత. వైజాగ్ సత్య మంచివాడని.. అతని వల్ల మేలు జరిగిందని పలు ఇంటర్వ్యూలతో చెప్పిన కుర్చీ తాత.. ఇప్పుడు రివర్సవ్వడం గమనార్హం. వైజాగ్ సత్య.. తన పేరు ఉపయోగించుకుని డబ్బులు దండుకుంటున్నాడని ప్రచారం చేయడం.. చంపేస్తా, నరికేస్తా అంటూ వీడియోలు చేయడంతో..

ఆందోళన చెందిన వైజాగ్ సత్య కుర్చీ తాతపై ఫిర్యాదు చేశాడు. తమన్ దగ్గరకు తీసుకుని వెళ్లినట్టే మహేష్ బాబు దగ్గరకు కూడా తీసుకుని వెళ్లాలని గొడవ చేస్తున్నాడట కుర్చీతాత. అది అసాధ్యం అని చెప్పడంతో కుర్చీ తాత తనను టార్గెట్ చేసినట్లు చెబుతున్నాడు వైజాగ్ సత్య. 2 రోజులుగా కుర్చీతాత కోసం పోలీసులు వెతుకుతున్నారని.. చివరికి బుధవారం నాడు అరెస్ట్ చేసినట్లు చెప్పాడు వైజాగ్ సత్య. కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా. హైదరాబాద్‌లో కృష్ణ కాంత్ పార్క్ తిరుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఫేమస్ అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *