కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరెంట్ పోయిందని విమర్శించారు కేటీఆర్. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించామా? అని అక్కడి ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ కాదని 5 గంటల కరెంటు ఇస్తామని నేతలు అంటున్నారు.
కొడంగల్ పేరును అంతర్జాతీయ స్థాయిలో చెడగొట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. అయితే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం భువనగిరి సెగ్మెంట్ పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించారు.
ఆ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ వల్లే పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ అవినీతిలో కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.