సూపర్ స్టార్ గా దాదాపు 350 పైగా సినిమాల్లో నటించిన నటశేఖర కృష్ణ, మొదటగా 1961లో శ్రీమతి ఇందిరా దేవిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారికి పద్మావతి, రమేష్ బాబు, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని మొత్తం ఐదుగురు సంతానం. అయితే సినిమా ఇండస్ట్రీకి ప్రవేశించిన కొత్తలో కృష్ణ నటించిన సాక్షి సినిమా లో ఆయన సరసన విజయ నిర్మల హీరోయిన్ గా నటించారు. సినిమా తర్వాత కొద్దిరోజులకు వారిద్దరూ కూడా 1969లో వివాహము చేసుకోవడం జరిగింది.
అయితే కృష్ణ గారు విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు..ముఖ్యంగా కృష్ణ గారి అమ్మ అయితే విజయ నిర్మల గారిని చాలా తీవ్రంగా వ్యతిరేకించేది..ఎముకంటె ఇందిరా గారు స్వయానా కృష్ణ గారి అమ్మగారికి మేనకోడలు అవుతుంది..తన మేనకోడలికి ఇంత అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేని అని..ఈ పెళ్ళికి నేను ససేమీరా ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పిందట..ఆ సమయం లో కృష్ణ గారి సోదరుడు ఆది శేషు గారు చొరవ తీసుకొని కృష్ణ గారి తల్లిని మరియు కృష్ణ గారి మొదటి భార్య ఇందిరా గారిని ఒప్పించి ఈ పెళ్లి చేశారట.
కృష్ణ గారి గగోగులు అన్ని కూడా మొదటి నుండి విజయ నిర్మల గారే దగ్గరుండి చూసుకునేవారట..ఆమె చివరి క్షణం వరుకు కృష్ణ గారి చేతులు వదలలేదు..కొన్నేళ్ల క్రితమే ఆమె గుండెపోటు తో మరణించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఆమె మరణించిన సమయం లో కృష్ణ గారు ఎంత బాధకి గురయ్యారో మన అందరం చూసాము..ఎప్పుడు ఎలాంటి సందర్భం వచ్చిన చెక్కు చెదరని ఆత్మా విశ్వాసం తో ఉండే కృష్ణ గారిని అలా ఏడవడం చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం కంటతడి పెట్టుకున్నారు.