కృష్ణా నదిలో ప్రత్యక్షమైన రాముడి విగ్రహాలు, అయోధ్య రాముడి రూపంలో శ్రీమహావిష్ణువు, శివలింగం.

కర్ణాటకలోని రాయిచూర్‌ జిల్లా దేవసుగుర్‌ గ్రామ సమీపంలో కృష్ణ వంతెన పనులు జరుగుతున్నాయి. నదిలో పనులు చేపడుతుండగా బయట పడిన విగ్రహాలు శతాబ్దాల చరిత్ర కలవని తెలుస్తోంది. శ్రీమహా విష్ణువు అనేక ప్రత్యేకతలతో కూడి ఉంది. నాలుగు చేతులతో మహా విష్ణువు నిలబడిన ఆకారంలో ఉన్నారు. పై చేతుల్లో శంఖు చక్రాలు, మరో రెండు చేతుల్లో కటి హస్త, వరద హస్త ఉన్నాయి. విష్ణువు చుట్టూ దశావతారాలు ఉన్నాయి. మత్య్స, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి దశావతారాలు విగ్రహంపై ఉన్నాయి. వేంకటేశ్వరుడి రూపంలో ఈ విగ్రహం పోలి ఉండడం మరింత ఆసక్తికరంగా ఉంది.

అయితే విష్ణువు ప్రతి విగ్రహంలో ఉండే గరుడుడు ఈ విగ్రహంలో లేకపోవడం విశేషం. అలంకార ప్రియుడైన విష్ణువు కావడంతో ఈ విగ్రహంపై పూలమాలలు కూడా ఉండడం విశేషం. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణా నదికి సంబంధించి వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం వంతెన పనులు చేపడుతుండాగా.. నదిలో కొన్ని విగ్రహాలు దర్శనమిచ్చాయి. వాటిని అలా తవ్వుతుండగా.. సాక్ష్యత్తు శ్రీ మహా విష్ణువు నిలువెత్తు విగ్రహం, ఒక శివలింగం దర్శనమిచ్చింది. దీనిని అధికారుల ఆదేశాలతో అత్యంత జాగ్రత్తగా తవ్వకాలు చేపట్టి విగ్రహాలుకు ఎటువంటి దెబ్బతినకుండా బయటకు తీశారు.

వాటిలో శ్రీమహావిష్ణువు విగ్రహం పరిశీలించగా.. అది ఇటీవలే అయోధ్య రామలయంలో ప్రతిష్టించిన రామ్‌ లల్లా విగ్రహంలా ఉంది. పైగా ఆ విగ్రహాలు శతాబ్దాల చరిత్ర చెందినవిలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీమహా విష్ణువుని చూస్తే.. నాలుగు చేతులతో నిలబడిన ఆకారంలో ప్రత్యేకంగా కనిపించింది. అలాగే పై చేతుల్లో శంఖు చక్రాలు, మరో రెండు చేతుల్లో కటి హస్త, వరద హస్త ఉన్నాయి. విష్ణువు చుట్టూ మత్య్స, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి వంటి దశావతారాలు కలిగి ఉన్నాయి. ఇది అచ్చం వేంకటేశ్వర స్వామి పోలిక మరింత ఆకర్షణీయంగా ఉంది.

అయితే విష్ణువు విగ్రహంలో ఉండే గరుడుడు ఈ విగ్రహంలో లేకపోవడం విశేషం. ఇక ఈ విగ్రహంపై పూలమాలలు కూడా ఉండడం విశేషం. దీంతో ఈ వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. స్థానిక ప్రజలు దీనిని చూడటానికి చాలా ఆసక్తి కనుబరుచుతున్నారు. మరి, నదిలో అయోధ్య రాముడిని పోలి ఉన్న శ్రీమహావిష్ణువు, శివలింగం బయటపడటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *