సినిమా ప్రేక్షకులకు తెలియకుండా కొంతమంది హీరోలు ఇలా విగ్ పెట్టుకుని ఏకంగా తమకు బట్టతల ఉంది అన్న విషయాన్ని కవర్ చేస్తూ ఉంటారు అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు గురించి కూడా ఇలాంటి వార్తలు ఎన్నో రోజులుగా వస్తూనే ఉన్నాయి. అయితే కృష్ణ కుమారుడు మహేశ్ బాబు కూడా సినిమాల్లో విగ్గు వాడుతున్నట్లు మాధవరావు తెలిపారు.
మహేశ్ బాబుకు మేకప్ మెన్ గా తన మేనల్లుడు పట్టాభి పనిచేస్తన్నాని అన్నారు. మహేశ్ బాబు తలపై పలుచటి వెంట్రుకలు ఉంటాయి. దీంతో ఆయనకు ప్రతీ సినిమాలో విగ్గు వాడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇక కృష్ణ పలు సందర్భాల్లో తనకు ఎంతో మేలు చేసేవారని, మమ్మల్ని ఎంతో మంచిగా చూసుకునేవారని మాధవరావు తెలిపారు. ఇలా కృష్ణకు సంబంధించిన ప్రతీ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.
ఆయనతో పనిచేసిన వాళ్లు కృష్ణ గురించి అనేక విషయాలు మీడియాకు అందిస్తున్నారు. ఇక ఇటీవలే కృష్ణ ఆస్థికలను మహేశ్ బాబు పలు ప్రముఖ నదుల్లో కలిపారు. ఆ తరువాత చిన్న కర్మను చేశారు. ఈ సందర్భంగా కృష్ణ తో గడిపిన కృణాలను మహేశ్ గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.