తనను గెలిపిస్తే విజయయాత్ర ఉంటుందని, లేదంటే తన శవయాత్ర ఉండడం ఖాయమని బహిరంగ సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆఖరి రోజున కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
అయితే అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్‌లా నక్క జిత్తులతో గెలవలేదని అన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన తనను గెలిపించేందుకు తన భార్యాబిడ్డలు ప్రచారం చేశారని.. తన గెలుపు కోసం వాళ్లు ప్రచారం చేయడంలో తప్పేముందో చెప్పాలని పొన్నం ప్రభాకర్‌ను నిలదీశారు.