దేశంలో ఏ రాజకీయ పరిణామం చోటుచేసుకున్నా దాని గురించి కేఏ పాల్ స్పందించకుండా ఉండరు. దేశంలో బీజేపి విధానలు, పరిపాలన, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, గత ప్రధాన మంత్రులు దేశాభివృద్దికి ఏం చేసారు, ఎలాంటి ప్రణాలికలు అమలు చసారు అనే అంశాలను గంటల కొద్ది వాదిస్తుంటారు పాల్. అయితే ఓ ఇంటర్వ్యూ లో కేఏ పాల్ మాట్లాడుతూ..” నేను చాలా సంతోషిస్తున్నాను.
నాకు దేవుడి దయవల్ల ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు. నా కొడుకు, కోడలు జ్యోతి ఏడు సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. మా కుటుంబంలో జ్యోతి లాంటి స్ట్రాంగ్ పర్సన్ దొరకడం మాకు అదృష్టం. అయితే వీలైనంత త్వరగా నా కోడుకు, కోడలు పెళ్లి చేసుకోవాలి అని నా కోరిక, ప్రార్థన. వాళ్లిద్దరు మాత్రం ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోమని అంటున్నారు.
ఇండియాలో జ్యోతి, ఆమె సోదరుడు నాకు సపోర్టుగా ఉంటున్నారు. నాపై దాడి జరిగిన రోజు ఎందుకో జ్యోతి తట్టుకోలేకపోయింది. ఇంక అవకాశం ఉంటే వాడిని అక్కడిక్కడే కొట్టేది. జ్యోతి దొరకడం మా భాగ్యం” అంటూ మరికొన్ని ఆసక్తిక విషయాలు వెల్లడించారు. మరి..కేఏ పాల్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.