బిగ్ షాక్, కోళ్లకు వయాగ్రా పెడుతున్న యజమానులు, కారణం తెలిస్తే షాక్.

కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి… కోడి పందేలు నిర్వహిస్తున్నారు. వీటిని తిలకించేందుకు, పందేల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే సంక్రాంతి వస్తోందంటే కోస్తా జిల్లాల్లో సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజులు ఎక్కడ చూసిన కోడిపందాలు జరుగుతూనే ఉంటాయి. వాటి కోసం నెల రోజుల ముందు నుంచే బరులు గీసి పుంజులను సిద్ధం చేస్తారు. అయితే ఈసారి పందెం కోళ్లకు తెగుళ్లు సోకాయి.

పందెం పుంజులకు దెరాణిఖెత్ అనే వైరల్ వ్యాధి సోకి వాటిని బలహీనపరిచింది. సంక్రాంతి సీజన్‌లో కోళ్లు తెగుళ్ల బారిన పడడంతో పెంపకందారుల్లో ఆందోళన నెలకొంది. కోళ్లన్నీ బలహీనంగా మారిపోతున్నాయి. బరిలో ఉండే కోళ్లు బలంగా ఉండాలి. ప్రత్యర్థి కోడిపై దాడి చేసేంత దృఢంగా ఉండాలి. కోళ్లకు అలాంటి ఆహారం..అలాంటి కోళ్లలో వేగంగా శక్తి పెంచడానికి పెంపకందారులు సరికొత్త మార్గాలను వెతుకుతున్నారు.

వయాగ్రా, షిలాజిత్, విటమిన్ల కాక్టెయిల్‌తో కూడిన ఆహారం అందిస్తూ వాటిని బలంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై పశువైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పదార్ధాలు కోళ్లలో తాత్కాలికంగా పనితీరును మెరుగుపరుస్తాయని, కానీ భవిష్యత్తులో కోళ్లకు హాని తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కోళ్లను మనుషులు తింటే వారి ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *