పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఓ కోడిపుంజు కూతూ కనిపించింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి శివారులో నాటు కోళ్ల దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఓ కోడి పుంజును లాకప్‌లో ఉంచారు పోలీసులు.
ఎందుకు అనుకుంటున్నారా.. జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి గ్రామ శివారులో ఓ గ్రామానికి చెందిన బాలుడు కోడిపుంజు దొంగతనం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. పోలీసులు వచ్చి బాలుడిని, అతనితోపాటు కోడిపుంజునూ స్టేసన్‌కు తీసుకొచ్చారు. కోడిపుంజు ఎవరిదో తెలియక పోవడంతో బయట ఉంచితే కుక్కలు దాడి చేసే ప్రమాదం ఉందని పోలీసులు కోడిపుంజునూ లాకప్‌లో ఉంచారు.
దానికి గింజలు వేస్తూ పోలీసులు కాపలా కాయటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో స్టేషన్‌కు వచ్చిన వారందరూ లాకప్‌లో కోడిపుంజును ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు.