ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ చౌదరి. ఈ పేరును ఎక్కువ మంది గుర్తుపట్టక పోవచ్చు కానీ.. యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది. అయితే ప్రస్తుతం రవికుమార్ చౌదరీ, రాజ్ తరుణ్‌తో తిరగడబారా సామి అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజవగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాలో జక్కన్న, రోగ్ సినిమాల హీరోయిన్ మన్నారా చోప్రా కీలకపాత్ర చేస్తుంది. కాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు ఏఎస్ రవి కుమార్.. మన్నారా చోప్రాకు మీడియా ముందే ముద్దిచ్చాడు. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన్నారా చోప్రా నవ్వుతూ కవర్ చేసినట్టుగా అనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఇక దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా హీరోయిన్‌లతో చిలిపి చేష్టలు చేయడం పద్దతి కాదని, ఇలాంటి వాళ్లను ఊరికే వదిలి పెట్టకూడదని అంటున్నారు.
అంతేకాకుండా హీరోయిన్లు కూడా వీటిపై గట్టిగా రియాక్ట్ అవ్వాలని, వాటిని ప్రతిఘటించాలని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు కూడా గతంలో చాలానే జరిగాయి. ఓసారి సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు స్టేజ్ మీదే కాజల్‌కు ముద్దు పెట్టిగా.. అది ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చివరికి కాజల్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే అలా చేశానని చోటా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మరీ ఏఎస్ రవికుమార్ తను చేసిన పనికి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి.
#PriyankaChopra’s cousin, actress #Mannarachopra gets kissed by director AS Ravikumar in front of the media! 🤦🏼♂️#TiragabadaraSaamipic.twitter.com/54w5JHvjIv
— Ajay AJ (@AjayTweets07) August 29, 2023