మే నెలలో లక్ష్మీ ప్రసన్నతో నిశ్చితార్థం చేసుకున్న కిర్రాక్ ఆర్పీ.. ఇప్పుడు పెళ్లి తంతు కూడా పూర్తి చేశాడు. తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో కిర్రాక్ ఆర్ఫీ చెప్పిన సంగతి తెలిసిందే. లక్ష్మీ ప్రసన్నను లవ్ చేసి మూడుముళ్ల బంధంలోకి ఆయన ఎంట్రీ ఇచ్చాడు. అయితే కిఆర్పీ చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డ ఆమె.. ఆతరువాత అతనికి విషయం వివరించింది. మొత్తానికి వీరు ప్రేమని వ్యక్త పరుచుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది.
ఇక వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ డమ్ సంపాదించాడు ఆర్పి. కిర్రాక్ ఆర్పీగా పేరు తెచ్చుకుని.. టీమ్ లీడర్ గా కూడా మంచి మంచి స్కిట్ లు చేశాడు. ఆయన ఏం స్కిట్ చేసినా.. నెల్లురు యస.. నెల్లురు పదం, వెంకటేశ్వరావు.. ఈ మూడు ఉండేట్టు చూసుకునేవాడు. జబర్థస్తు నుంచి బయటకు వచ్చి.. ఆ షోపై.. నిర్వాహకులపై ఘాటు విమర్షలు చేశాడు ఆర్పీ. కామెడీ షో నుంచి బయటకు వచ్చి..వెండితెరపై వెలగాలి అనుకున్నాడు కీరాక్ ఆర్పీ.
దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుని..దెబ్బతిన్నాడు. ఇక లాభం లేదు అని.. బిజినెస్ వైపు వచ్చాడు ఆర్పీ. బయటకు వచ్చి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్లు స్టార్ట్ చేశాడు. బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి.. దూసుకుపోతున్నాడు ఆర్పీ. ఈ విషయంలో మంచి సక్సెస్ ను వెనకేసుకుకోవడంతో పాటు మంచి లాభాలు కూడా వెనకేసుకుంటున్నాడు ఆర్పీ. ఇక ఆర్పీ ఒక్క బ్రాంచ్ తో ఆపకుండా.. ఈ చేపల పులుసు పేరు మీద.. ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేసాడు ఆర్పి.
హైదరాబాద్ లోనే కూకట్ పల్లి, మాదాపూర్, అమీర్ పేట ప్రాంతాల్లో ఆర్పీ చేపల పులుసు ఓన్ బ్రాంచెస్ ఉన్నాయి. అనంతపూర్, బెంగుళూర్, విశాఖ పట్టణాల్లొ ఫ్రాంచైజీస్ ఇచ్చిన ఆర్పీ.. భారీగా లాభాలు సాధిస్తున్నాడు. తాజాగా తిరుపతిలో మరో బ్రాంచ్ ను కూడా ఘనంగా స్టార్ట్ చేశాడు ఆర్పీ.