జబర్దస్త్ లో మొదట ఒక చిన్న రైటర్ గా వర్క్ చేసి ఆ తర్వాత రెగ్యులర్ కమెడియన్ గా మారిపోయి అనంతరం మళ్ళీ గ్రూప్ లీడర్ గా కూడా తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. కిరాక్ ఆర్పి చాలా కాలం పాటు జబర్దస్త్ లో నిలదొక్కుకుంటూ ఆర్థికంగా కూడా స్థిరపడ్డాడు. అంతేకాకుండా సొంతంగా ఫ్లాట్ కూడా తీసుకొని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని భార్య కూడా ఈవెంట్స్ నిర్వహిస్తూ మంచి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.
అయితే తాజాగా మీడియాతో ఆర్పీ మాట్లాడుతూ కస్టమర్ల సంతృప్తి తనకు ముఖ్యమని వ్యాపారంలో లాభాలు రాకపోయినా తనకు పరవాలేదని కామెంట్స్ చేశారు. త్వరలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రాంచైజీ లను మొదలు పెడుతున్నానని ఆర్పి తెలిపారు. ఇక అదే సమయంలో తన పెళ్లి గురించి ప్రస్తావన రాగా.. లక్ష్మీ ప్రసన్న గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. గత ఏడాది మేలో ఆర్పి కి లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో నిశ్చితార్థం కూడా జరిగింది.
ఇక పెళ్లెప్పుడు అనే సందేహం అందరిలో ఉండగా.. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. నాకు అబద్దాలు చెప్పడం రాదు. లక్ష్మీ ప్రసన్న వెంట నేను రెండేళ్లు పిచ్చి కుక్కలాగా తిరిగాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు.