కింగ్ కోబ్రా..ఇది పాములన్నింటిలో కెల్లా అత్యంత పొడవైనది. ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో ఉండే కింగ్ కోబ్రా.. భారత దేశంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి. కింగ్ కోబ్రా కాటు వేసిందంటే.. 10-15 నిమిషాల్లో మనిషి చనిపోతాడు. కింగ్ కోబ్రా కాటుకు భారీ ఏనుగు కూడా చనిపోతుంది. అయితే కార్లను అడవి, కొండ ప్రాంతాల్లో పార్క్ చేసినప్పుడు తప్పకుండా కారును చెక్ చేయాల్సి ఉంటుంది.
ఇటీవలే అడవి ప్రాంతాల్లో పార్క్ చేసిన కార్లలో చాలావరకు విష సర్పాలు బంపర్ల కింద ఎక్కడో ఒకచోట దాగివున్న వాటిని పట్టుకొని సురక్షిత ప్రాంతాల్లో వదిలేశారని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. కాబట్టి మీరు కూడా అడవి ప్రాంతాల్లో తిరిగినప్పుడు మీ కారు బంపర్లో, కార్లో కానీ తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పాములను పట్టుకునేందుకు ఎంతో నైపుణ్యం ఉండాలి. లేకపోతే అవి కాటేసే ప్రమాదం కూడా ఉంది.
ప్రస్తుతం చాలామంది స్నేక్ క్యాచర్స్ భూమిపై ఉన్న విష సర్పాలను రక్షించేందుకు తమ వంతు కృషిగా జనజీవన స్రవంతిలో సంచారం చేసే పాములను పట్టుకొని సురక్షితమైన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వదిలేస్తున్నారు. పెద్ద పెద్ద సర్పాలను రక్షించే వారిని గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వీడియోను లివింగ్ జూలోజి అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను ఐదు లక్షలకు పైగా మంది వీక్షించారు.