కామాఖ్య దేవాలయంలో యోనికి ఒక్క పూజ చేస్తే లక్ష తీసుకుంటారు, ఆ పూజ మహిమ తెలిస్తే..?

కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు. కామాఖ్యా దేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ రాతిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెబుతారు. ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది.

ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలు పెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడుతారు. నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు.

అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. దేవీ భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి ప్రస్తావన స్పష్టంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *