ఎట్టకేలకు ప్రేమించి పెళ్లి చేసుకున్న యంగ్‌ హీరో. వైరల్‌ అవుతోన్న పెళ్లి ఫొటోలు.

తమిళ బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లోనూ పాల్గొన్నాడు కెవిన్‌. ఆ సమయంలో తోటి కంటెస్టెంట్‌ లాస్లియాతో లవ్‌లో పడ్డాడు. ఈ విషయాన్ని లాస్లియా కూడా ధృవీకరించింది. కానీ వీరి ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. కొద్దికాలానికే వీరిద్దరూ బ్రేకప్‌ చెప్పుకున్నారు. కెవిన్‌ ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌ సతీష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ప్రముఖ కోలీవుడ్‌ యంగ్‌ హీరో కెవిన్‌ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.

కవిన్‌ లేటెస్ట్ మువీ ‘దాదా’ చిత్రంతో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్న కవిన్‌ తన ప్రేయసి మోనిక డేవిడ్‌ను ఆదివారం (ఆగస్టు 20) ఉదయం వివాహమాడాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రేయసి మోనిక డేవిడ్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు కవిన్‌ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశాడు. ఇక కవిన్‌ ఫ్యాన్స్‌తోపాటు, పలువురు సెలబ్రెటీలు నూతన దంపతులకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరి పెళ్లి వేడుకకు నటి నయనతార, ఆమె భర్త దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ సహా తదితర తారలు హాజరై సందడి చేసినట్లు తెలుస్తోంది. కాగా కెవిన్‌ ‘కనా కానమ్‌ కలలాంగల్‌’ అనే తమిళ టీవీ సీరియల్‌లో తొలిసారి నటించాడు. హీరో కవిన్ పెళ్లి వీడియో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *