ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజలతో మాత్రం ఎంతో సరదాగా ఉంటారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పర్యటిస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు ఆయనలోని చమత్కారాన్ని తెలియజేస్తాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన చమత్కారాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
బాగున్నావా పెద్దమ్మ.. బాగున్నావా పెద్దాయన… బాగున్నావా అక్క… ఏరా చిన్నా…. ఏం హీరోస్ అని పలకరింపులతో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో ప్రధానంగా నియోజకవర్గ సమస్యల తోపాటు ఫన్నీ ఇన్సిడెంట్లు చాలానే జరిగాయి.
ముదిగుబ్బ టౌన్ లో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఒక ఎనిమిదో తరగతి పిల్లవాడు తన సమస్య చెప్పుకున్నాడు. అది ఏంటంటే ఆడుకోవడానికి వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ ఇవ్వడం లేదంటూ చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూసాయి.