ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా వినిపించే పేరు. ప్రధానంగా ’గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారారు. ఈ కార్యక్రమం ద్వారా ఎందరో ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులంటే.. నియోజకవర్గాల్లో ఏదైనా అభివృద్ధి పనులు, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు వస్తుంటారు. అయితే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 1980లో కేతిరెడ్డి సూర్య ప్రతాపరెడ్డి దంపతులకు అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో జన్మించాడు.
వారిది రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం. కేతిరెడ్డి జన్మించే నాటికి అంటే 1980 ప్రాంతంలో రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ తాండవిస్తోంది. దీంతో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తండ్రి ఆయనను మూడేండ్ల వయసులో తాడిపత్రిలో ఉన్న అరవింద్ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడే వెంకటరామిరెడ్డి పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది.
ఆ తర్వాత తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న భారతీయ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత రిలయన్స్ లో మంచి ఉద్యోగం రావడంతో హైదరాబాద్ కు మారారు. ఈ తరుణంలో సుప్రియ రెడ్డితో వివాహం జరిగింది. కొన్ని రోజులు హైదరాబాదులోనే జీవనం కొనసాగించారు.