గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజూ నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో, కాలనీలో పర్యటిస్తూనే ఉంటారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. కుదిరితే అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తారు…. లేదంటే అధికారులకు చెప్పి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలలో నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఎవరు అంటే ముందుగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేరే గుర్తొస్తుంది.
గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో కాలనీలో పర్యటిస్తూనే ఉంటారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. కుదిరితే అక్కడికక్కడే సమస్యకు పరిష్కారం చూపిస్తారు. లేదంటే అధికారులతో చెప్పి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. ఇలా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. చిన్న, పెద్ద , ముసలి వాళ్లు ఉన్న తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
ప్రతిపక్ష పార్టీలపై ఘాటుగా విమర్శలు చేసే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రజలతో మాత్రం ఎంతో సరదాగా ఉంటారు. ఆయన చేసిన చమత్కారాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ధర్మవరంలోని చౌడేశ్వరి అమ్మవారి శత జ్యోతుల మహోత్సవం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి తో పాటు ఆయన భార్యతో సతీ సమేతంగా విచ్చేశారు.