ఎవరినీ ఎక్కడ ఉంచాలో KTR కి బాగా తెలుసు, ఈ వీడియో చుస్తే మీకే అర్ధం అవుతుంది.

ఈ నెల 7వ తేదీన ఎర్రవెల్లి పామ్ హౌస్ లో ని బాత్రూంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాలు జారి పడ్డారు. దీంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటికి ఆపరేషన్ నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన కేసీఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స జరిగిన తర్వాత నుండి కేసీఆర్ యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. కేసీఆర్ వెంట కుటుంబ సభ్యులున్నారు.

కేసీఆర్ ను పలువురు వీఐపీలు, మంత్రులు, రాజకీయ నేతలు పరామర్శిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఇవాళ పరామర్శించారు. తుంటి ఎముక విరిగిపోవడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు కొంత సమయం క్రితమే చేరుకొని పరామర్శించారు. ఆయన వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు.

జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి హాస్పిటల్ కు చేరుకున్న సీఎం, మంత్రులకు హాస్పిటల్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం 9వ అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో కాసేపు మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని, అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తెలంగాణ ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *