కేసీఆర్ విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ ఇతనికి రాజకీయ గురువు. అయితే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా వర్శిటీలో ఎం.ఎ తెలుగు లిటరేచర్ పూర్తి చేశారు. ఆయన భార్య శ్రీమతి శోభా.
కేసీఆర్ దంపతులకు ఒక కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన కె.చంద్ర శేఖరరావు ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1999-2001 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు. ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు ప్రారంభం నుండి తాను ఉంటున్న తెలుగుదేశం పార్టీకి డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రల్ 27 న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు.
2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందినాడు. 14వ లోక్ సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోక్ సభ సభ్యులన్న టీఆర్ఎస్ తరఫున కేసీఆర్ మంత్రి పదవి పొందారు. 004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేయడమే కాకుండా యు.పి.ఏ. కూటమికి మద్దతు కూడా ఉపసంహరించబడింది.