హీరోయిన్ గా నటి కస్తూరి శంకర్ మంచి పేరు తెచ్చుకుంది. అన్నమయ్య లాంటి సినిమాల్లో ఆమె నటన మెప్పించింది. అయితే ఈమె చాలా తక్కువ సినిమాలలో హీరోయిన్ గా నటించి.. చాలా చిన్నవయస్సులోనే పెళ్ళి చేసుకుంది. ఆతరువాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. సినిమాలకు దూరం అయిన కస్తూరి.. ఫారెన్ లో సెటిల్ అయ్యి.. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల నాకు డెవిల్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.
అందులో సీత పాత్ర నేను చేయాల్సింది. అయితే నేను యంగ్‌గా కనిపిస్తున్నాని అగ్రిమెంట్ తర్వాత తీసేశారు. ఇక రజినీకాంత్.. ‘కాలా’లో కూడా రజినీకాంత్ గారి పక్కన నేను చాలా యంగ్‌గా ఉన్నానని తీసేశారు. రజినీ పక్కన పెద్ద పెద్ద పిల్లలకి అమ్మలాగ నేను సెట్ కావడం లేదని ఈశ్వరీరావుని తీసుకున్నారు. అందరూ వయసు అయిపోతుందని బాధపడతారు. కాని నేను వయసు ఎందుకు పెరగడం లేదని బాధపడుతున్నాను.
ఏం చేయను నా ఫేస్ అలాంటిది. యంగ్ గానే కనిపిస్తాను. నా జట్టుకి కలర్ కూడా వేసుకోను. ఇది ఒరిజినల్ కలర్. ఇప్పుడు నేను తెల్ల రంగు వేసుకొని నటించే పరిస్థితి వచ్చింది. నా బతుకు ఇలా అయిపోయింది. వయస్సు వస్తే ఒక బాధ, రాకపోతే మరొక బాధ. మరో ముప్పై ఏళ్ల వరకు నాకు తల్లి పాత్రలే వస్తాయి. కానీ ఇప్పుడు నేను మదర్ క్యారెక్టర్స్ చేయలేను. మహేష్ బాబుది నాదీ సేమ్ ఏజ్..
అలాంటప్పుడు ఆ హీరోల పక్కన మదర్‌గా చేస్తే హీరోయిన్‌గానే ఉంటాను కదా.. ఆయనకి జోడీగా ఉంటాను. కనీసం చూసేవాళ్లకి మదర్‌లా కనిపించాలి కదా.. అంటూ తెగ ఫీల్ అయిపోతుంది ఈ కస్తూరి శంకర్.ఈమె ఇన్ని చెబుతుంది కదా గృహలక్ష్మీ సీరియల్‌లో అమ్మమ్మ పాత్రకి బాగా సెట్ అయింది.సీరియల్‌లో అమ్మమ్మ పాత్ర చేసింది కాని సినిమాలలో మాత్రం మహేష్ బాబు లాంటి వాళ్లకి తల్లిగా నటించాలంటే చాలా ఫీలైపోతుంది.