గంటకు ఐదు వేలు వస్తాయ్..! కస్తూరి శంకర్ దిమ్మతిరిగే సమాధానం.

అన్ని భాషల్లోమంచి సినిమాలు చేసిన కస్తూరి ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో గృహలక్ష్మి అనే సీరియల్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన కస్తూరి ట్విట్టర్లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రాజకీయంగా, వ్యక్తిగతంగా తనదైన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. “నువ్వు డబ్బుల కోసమే షోకి వెళ్లావు కదా. మళ్లీ ఇప్పుడు అలా ఎందుకు మాట్లాడుతున్నావ్” అని కామెంట్ చేస్తే, మరో నెటిజన్ మాత్రం కాస్త శృతి మించి కామెంట్ పెట్టాడు.

“అవునులే నీకు గంటకు 5000 వస్తాయి కదా” అంటూ కాస్త అసభ్యకరంగా ఆ నెటిజన్ కామెంట్ చేస్తే దానికి కౌంటర్ ఇచ్చిన కస్తూరి..” మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇలానే పెంచారా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది” అని ఆ నెటిజన్ పై సీరియస్ అయింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో ఇదే తమిళ బిగ్ బాస్ సీజన్ 3లో కస్తూరి కంటెస్టెంట్ గా పాల్గొంది. ఆ సీజన్లో వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్ కూడా ఓ కంటెస్టెంట్ గా ఉంది.

దీంతో బిగ్ బాస్ షో అంటే అసలు ఇష్టం లేదని చెప్పిన నువ్వు గతంలో బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వెళ్లావు? అంటూ రకరకాలుగా నెటిజన్స్ సోషల్ మీడియాలో కస్తూరిని నిలదీస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమాల్లో హీరోయిన్ గా అలరించిన కస్తూరి ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ తో ఆకట్టుకుంటోంది. తెలుగులో ‘నిప్పురవ్వ’, ‘సోగ్గాడి పెళ్ళాం’, ‘చిలక్కొట్టుడు’, ‘ఆకాశవీధిలో’, ‘అన్నమయ్య’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో అక్క, వదిన క్యారెక్టర్స్ తో కూడా మెప్పించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *