ఖర్జూరాలు విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ డీ, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఈ కారణంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. ఇందుకోసం ప్రతి రోజు నిద్రపోయే ముందు రెండే రెండు ఖర్జూరాలు తీసుకుంటే చాలని ఆరోగ్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాలను తీసుకున్న తర్వాత ఓ గ్లాస్ పాలు తాగితే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు.
అయితే శారీరక శ్రమ చేసేవారు రోజూ ఖర్జూర తినడం ఆరోగ్యానికి మంచిది. జ్ఞాపకశక్తి తగ్గిన వారు ఖర్జూర తరచూ తింటే మరలా మామూలు స్థితికి వస్తారు. ఖర్జూరం జ్యూస్ ను రెగ్యురల్ గా తాగడం వల్ల చర్మానికి పోషణ బాగా అందుతుంది. దాంతో చర్మానికి మంచి గ్లో వస్తుంది. ఖర్జూరాలు చక్కగా జీర్ణం అవ్వడమే కాదు… ఇవి ఆహారనాళం, పెద్ద ప్రేగును బ్యాక్టీరియా నుంచీ దూరం చేస్తాయి. అందువల్ల అత్యంత ప్రమాదకరమైన కొలొన్ క్యాన్సర్ బారి నుంచీ పెద్ద ప్రేగును కాపాడినట్లవుతుంది.
అసిడిటీని అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని పీచు అరుగుదలకు సాయపడుతుంది. ఖర్జూరాలకు మన శరీరంలో వేడిని తగ్గించే అద్భుత గుణాలున్నాయి. వీటికి తేనె కూడా తోడవడం వల్ల దగ్గు, జలుబు, పడిశం వంటివి త్వరగా నయం అవుతాయి. అలాగే ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది. మిగిలిన డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే ఖర్జూరంలో శక్తినందించే క్యాలరీలు అధికంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వలన శరీరానికి కావల్సిన రోజువారీ పోషకాలు అందుతాయి. మరియు కర్జూరం జ్యూస్ రెగ్యులర్ గా తాడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది.