బాలీవుడ్ రెబల్‌గా కంగనా రనౌత్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం కంగనాకు అలవాటు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీపై ఓరేంజ్‌లో ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. అయితే కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా అనే పల్లెటూరిలో పుట్టిన అమ్మాయి.
అమ్మా నాన్నలు ఆమెని డాక్టర్ ని చేయాలనుకున్నారట కానీ మొండితనం, పట్టుదలా ఎక్కువ ఉన్న ఈ అమ్మాయి మాత్రం నటి అవ్వాలనుకుంది 16 ఏళ్ళ వయసు లో అన్ని ఆంక్షలనీ దాటుకొని కుటుంబం తో తెగదెంపులు చేసుకున్నంత పని చేసి మరీ డిల్లీ బయల్దేరింది. కష్టాలు పడింది, పస్తులు పడుకుంది కానీ అనుకున్నది సాధించింది. ఇప్పుడు బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ లలో కంగనా ఒకరు. కెరీర్ తొలినాళ్ళ లో తెలిసి తెలియక అవకాశాల కోసం చాలామంది కి లైంగికంగా లొంగిపోయాననీ చెప్పి ఒక్కసారి బాలీవుడ్ మొత్తాన్నీ బాంబ్ లా పేల్చేసింది.
బాలీవుడ్ లో పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు నన్ను బాగా వాడుకున్నారని అయితే అప్పట్లో తెలియక చేయాల్సి వచ్చిందని చెప్పింది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళు అలా లొంగి పోవాల్సిన అవసరం లేదని లౌక్యంగా వ్యవహరించాలని చెప్పి ఎవరెవరు నాతో ఆడుకున్నారో వాళ్ళ లిస్ట్ అంతా నా దగ్గర ఉందని చెప్పి షాక్ ఇచ్చింది. మొహమాటం తెలియదు, భయపడటం రాదు అందుకే కంగనా అంటే భయపడుతూనే ఆమెని అభిమానంగా చూస్తుంది బాలీవుడ్.