కళ్లు చిదంబరం ఎలా చనిపోయారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

కళ్లు చిదంబరం ..కేవలం నటన మీద సినిమాల మీద పిచ్చితో ఈయన తన కళ్ళను అశ్రద్ధ చేశారని చెప్పవచ్చు. కళ్ళు చిదంబరం కేవలం సినిమాలు నటించడమే కాదు విశాఖ పోర్టు ట్రస్ట్ లో కూడా అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేసేవారు అలాగే ఆ రోజుల్లో వరుసపెట్టి సినిమాలు చేసి డబ్బు కూడా బాగానే సంపాదించారట. అయితే కొల్లూరి చిదంబరం 1948 అక్టోబర్ 8న విజయనగరంలో జన్మించారు. ఎం.వి. రఘు డైరెక్షన్లో 1987లో వచ్చిన ‘కళ్లు’ అనే సినిమాలో చింబరం అంధుడిగా నటించారు. ఈ సినిమా సక్సెస్ కావడంతో పాటు ఆయన నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది.

ఆ తరువాత ఏప్రిల్ 1 విడుదల సినిమాలో ఈయన టీ లు అమ్మే వ్యక్తిగా కనిపిస్తాడు. ఇందులో చిన్న పాత్ర అయినా గుర్తింపు వచ్చింది. దీంతో ఆయన అమ్మోరు సినిమాలో అవకాశం వచ్చింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ నిలవడంతో చిదంబరంకు అవకాశాలు వరుసగా వచ్చాయి. దీంతో ఆయన గోల్ మాల్ గోవిందం, పెళ్లిపందిరి, పవిత్ర బంధం, అడవిచుక్క, చంటిగాడు తదితర చిత్రాల్లో నటించారు. కళ్లు చిదంబరం కుమారుడు రాఘవ రామకృష్ణుడు చెప్పిన ప్రకారం.. 2015 అక్టోబర్ 19న అనారోగ్యంతో మరణించారు. అయితే ఆ కాలంలోనే బాగా చదువుకొని పోర్ట్ ట్రస్ట్ అనే ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. చిదంబరం కు నాటకాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. దీంతో ఓ వైపు ప్రభుత్వం ఉద్యోగం చేస్తూనే మరోవైపు నాటకాల కోసం సుదూర ప్రయాణాలు చేసేవారు.

ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా హైదరాబాద్, చెన్నె వెళ్తుండేవారు. ఇలా నిద్రాహారాలు మానేసేసరికి కంటి నరం దెబ్బతిన్నది. వైద్యులు పరీక్షించిన తరువాత చికిత్స చేస్తామని చెప్పినప్పటికీ చిదంబరం ఒప్పుకోలేదు. ఎందుకంటే తనకు మెల్లకన్ను కలిసి వచ్చిందని అలాగే ఉంచుకున్నారు. అయితే అది రాను రాను తన అనారోగ్యంపై ప్రభావం చూపింది. అందువల్ల ఆయన ఆనారోగ్యంతో మరణించాడని ఆయన కుమారుడు చెబుతున్నారు. వర్మ నటించిన గోవిందా.. గోవిందా.. సినిమాలో తన నటనకు వర్మ పిదా అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *