ఏ దిశలో కలబంద మొక్కను పెట్టాలి? ఏ దిశలో పెట్టకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కలను నాటడం చాలా శుభప్రదం. కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది. కలబంద మొక్క నాటిన చోట ప్రేమ, శ్రేయస్సు, సంపద, ప్రతిష్ట పెరుగుతాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకు దాని స్వంత ప్రాముఖ్యత ఉంటుంది. దీని వల్ల ఇంట్లో పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ దాగి ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదం.
కలబంద మొక్క ఎక్కువగా ఇళ్లలో కనిపిస్తుంది. కలబంద మొక్క అదృష్టమని భావిస్తారు. అలోవెరా మొక్క ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని చెబుతారు. దీంతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటవచ్చు. కానీ మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధించాలనుకుంటే, దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
దీంతో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది. ఎవరైనా నిరంతరం అనారోగ్యంతో ఉంటే, వారి పడకగదిలో కలబంద మొక్కను ఉంచవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్క కెరీర్‌తో పాటు కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల డబ్బు, ప్రమోషన్ రెండూ లభిస్తాయి.
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం కలబంద మొక్కను ఇంటి వాయువ్య మూలలో పెట్టకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తీసుకువస్తుందని అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి బాల్కనీ లేదా గార్డెన్‌లో కలబంద మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటమే కాదు, శక్తి ప్రవాహాన్ని కూడా పెంచుతుంది.