టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 2020లో బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని నటనకు కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చి నటనలో దూసుకుపోతుంది.
గతేడాది భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన.. ఈ బ్యూటీ ఇప్పటికీ అదే ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కాజల్ కి పబ్లిక్‌లో ఓ షాకింగ్ ఘటన ఎదురరైంది. మంగళవారం కాజల్ అగర్వాల్ హైదరాబాద్ లోని ఓ బట్టల దుకాణాన్ని ప్రారంభించడానికి వెళ్లింది. దాని ప్రారంభోత్సవం తరువాత ఆమె అభిమానులతో సెల్ఫీలు దిగడానికి వచ్చింది.
దీంతో ఆమె వైపు ఒక్కసారిగా అభిమానులు ఆమె మీదకు దూసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన ఓ ఆకతాయి… ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సెల్ఫీ కావాలని వచ్చి ఒక్కసారిగా కాజల్ నడుము మీద చేయి వేశాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ కాజల్ వెంటనే పక్కకి జరిగింది. విషయాన్ని గమనించిన ఆమె బౌన్సర్లు ఆ వ్యక్తిని పక్కకు లాగేశారు.
Orey 😳😳😳😳😳
— GetsCinema (@GetsCinema) March 6, 2024
https://t.co/XQ7yRcUGDX