టాలీవుడ్ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులర్ అయ్యారు. పెళ్లై ఓ బిడ్డకు జన్మించిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చిన ఈ భామ వరుస సినిమాలతో అదరగొడుతోంది. అంతేకాదు ఇపుడు బోల్డ్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తోంది.
అయితే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఆ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత అటు సంసార జీవితం సాగిస్తూనే మరో వైపు సినిమాల్లో నటించారు. ఇక ఇటీవలే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన బిడ్డకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టుకున్నారు కాజల్.
అది అలా ఉంటే కాన్పు తర్వాత కాజల్ మరోసారి తన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫోటోల్లో కాజల్ కేక పెట్టిస్తున్నారు. బిడ్డకు తల్లి అయినా తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు ఆ ఫోటోను చూసిన నెటిజన్స్. ఇక మరోవైపు కాజల్ కొన్నాళ్ల పాటు సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే వెచ్చించాలని కాజల్ భావిస్తున్నారట.