కాజల్..కెరీర్ బిగినింగ్ నుండి ఇప్పటివరకు తన గ్రాఫ్ ని పెంచుకుంటూ పోయింది. అంతేకాదు టాలీవుడ్ లో ఎక్కువ విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్గా కూడా నిలిచింది కాజల్. కమర్షియల్ సినిమాలతో కాజల్ తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకుంది. ఇక వివాహం తరువాత కూడా మంచి మంచి అవకాశాలతో దూసుకుపోతోంది కాజల్. అయితే కొన్ని రోజులు బాబుకి బ్రేక్ ఇచ్చి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం కాజల్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం కాజల్ బాలయ్య నటిస్తున్న ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తుంది. అయితే తాజాగా కాజల్ భర్త గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. గౌతమ్ కాజల్ కంటే ముందు ఒక స్టార్ హీరోయిన్ ను ప్రేమించాడట. కొత్త కాలం డేటింగ్ కూడా చేశాడట. ఈ విషయం కాజల్ కు కూడా తెలుసట. అయితే కాజల్ గౌతమ్ చిన్నప్పటినుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో వారిద్దరి మధ్య ఆ సమయంలో ఎలాంటి ఫీలింగ్ లేదని తెలిపింది.
గౌతమ్ స్టార్ హీరోయిన్ ను ప్రాణంగా ప్రేమించిన ఆ హీరోయిన్ మాత్రం డబ్బు కోసం గౌతమ్ ను వాడుకొని వదిలేసింది. ఆ సమయంలో గౌతమ్ డిప్రెషన్ కి గురయ్యాడని, ఆ టైంలో ఫ్రెండ్ గా ఉన్న కాజల్ అతని దగ్గర అవ్వడంతో వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత కుటుంబ సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ కు కూడా సినిమాలపరంగా ఫ్రీడమ్ ఇచ్చాడు. అలా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం కాజల్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ భగవంత్ కేసరీ ‘ సినిమాలో నటిస్తుంది.