కాంగ్రెస్ లో చేరాలి అనుకుంటున్నాని KCR, KTR కి ఫోన్ చేసి చెప్తే ఏం మాట్లాడుతున్నారంటే..?

కడియం శ్రీహరి.. పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా.. తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఉన్నారని కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడేమో అధికారం లేక ప్రతిపక్షంలో ఉన్నామని పేర్కొన్నారు. మొదటిసారి పోటీ చేస్తున్న కడియం కావ్యను ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయించవద్దనుకున్నామని తెలిపారు. తాను ఇంకా పార్టీ మారముందుకే తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ప్రజల మేలు కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చిన క్రమంలోనే తాను ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు కడియం శ్రీహరి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమను పార్టీ స్టేట్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి ఆహ్వానించారని, తమ సహచరులు, కార్యకర్తలతో చర్చించిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని, తాము ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమైన కడియం శ్రీహరి వారితో చర్చలు జరిపారు. వారు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అని, తమ రాక పట్ల వారు చాలా ఉత్సాహంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనేక కేసులతో అభాసుపాలు అయిందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. పార్టీలో ముఖ్య నాయకులు ఎవరు ఉండే పరిస్థితి లేదన్నారు. చాలా మంది నాయకులు బయటకు వచ్చేస్తున్నారని అన్నారు.

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తండ్రి తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని తాను అభ్యర్థిగా తప్పుకుంటున్నానని కెసిఆర్ కు లేఖ రాసి వెళ్లిపోయిన కడియం కావ్య కూడా తండ్రి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. నేడు కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *