కిలారి ఆనంద్ పాల్ ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు, మత ప్రచారకుడు, శాంతి దూత, మానవతావాది. అతను యు.ఎస్ లో గల గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI), గోస్పెల్ టు ద అన్ రీచ్‌డ్ మిలియన్స్ (GUM) సంస్థల వ్యవస్థాపకుడు.
అతను ఛారిటీ సిటీ తో పాటు అనేక అనాధ శరణాలయాలను హైదరాబాదులో నిర్వహిస్తున్నాడు. అతను అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని టెక్సాస్లో ఇతడి నివసిస్తుంటాడు. భారత దేశానికి వచ్చినప్పుడు. హైదరాబాదులో సాధారణంగా బస చేస్తాడు. 2008లో ప్రజాశాంతి పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు.
2009లో ఎక్కడా పోటీ చెయ్యలేదు.2014 లోనూ పోటీ చెయ్యలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు డెబ్బయి స్థానాల్లో పోటీ చేసినా అన్నిచోట్ల పాల్ తో సహా అందరు అభ్యర్థులు ధరవత్ (డిపాజిట్లు) కోల్పోయారు.