సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నటన వైపు అడుగు వేసిన జ్యోతిరాయ్. పలు కన్నడ సీరియల్స్, సినిమాలు నటించి గుర్తింపు తెచ్చుకుంది. జ్యోతిరాయ్ కి పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. అయినా ఇమని చూస్తే మాత్రం నమ్మశక్యం కలగదు. అంత యంగ్‌గా ఉంటుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో తల్లి పాత్రలో నటిస్తుంది ఈ బ్యూటీ.
అయితే జ్యోతిరాయ్ కన్నడ పరిశ్రమ నుంచి వచ్చారు. ఇప్పటి వరకు ఆమె కన్నడ, తుళు, తెలుగు భాషల్లో కలిపి 20కి పైగా సీరియల్స్ లో నటించారు. 15 వరకు సీరియల్స్ లో హీరోయిన్ గా అలరించింది. వీటిలో కస్తూరి నివాస్ సీరియల్ ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది. అయితే గుప్పెడంత మనసు సీరియల్ తో ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగి సినీ స్టార్ లెవల్లో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీసులో నటిస్తోంది. మరో కొన్ని ప్రాజెక్టులకు సైన్ చేసింది. జ్యోతిరాయ్ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే ఆమె గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
కొన్ని రోజుల పాటు కలిసున్న వీరు ఆ తరువాత విడిపోయారు. ప్రస్తుతం ఆమె జ్యోతిరాయ్ వయసు 38 ఏళ్లు. ఇప్పుడు ఆమె డైరెక్టర్ సుకు పుర్వాజ్ తో డేటింగ్ చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల కిందట ఆమె పేరు పక్కన ఆ డైరెక్టర్ పేరును చేర్చింది. దీంతో ఆయనతో కలిసి ఉండే అవకాశం ఉందని చాలా మంది చర్చలు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ఆమె సీరియల్ లో ఎంతో పద్దతిగా కనిపించినా.. సోషల్ మీడియాలో మాత్రం హద్దు పద్దు లేకుండా గ్లామర్ షో చేస్తోంది.