జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షను వ్యక్తం చేసిన లోకేష్ అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలని ఎవరెవరు కోరుకుంటారో వారందరూ రాజకీయాల్లోకి రావాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ అయింది. అయితే జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో డిమాండ్ డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరుపున ప్రచారం చేసి పార్టీకి మంచి మైలేజ్ తీసుకొచ్చారు తారక్.
ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయినప్పటికి ఎన్టీఆర్ చేసిన ప్రచారం మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ వాక్చాతుర్యం, పోలిటికల్ గా ఆయన మాట్లాడినా వ్యాఖ్యలు టిడిపి కార్యకర్తల్లో ఎనలేని జోష్ నింపాయి. ఇక అప్పటి నుంచి అడపా దడపా జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ కూడా పార్టీకి అవసరమైనప్పుడు అండగా ఉంటానని గతంలో వ్యాఖ్యానించారు. అయితే 2014, 2019 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ కనిపించలేదు.
అప్పటి నుంచి ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. చంద్రబాబే తారక్ ను పార్టీ కి దూరం చేశారని అనే వారు కూడా లేకపోలేదు. కారణాలు ఏవైనప్పటికి ఎన్టీఆర్ మాత్రం టీడీపీకి దురమౌతూ వచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత ఎన్టీఆర్ తిరిగి పార్టీలోకి రావాలని పార్టీ బాద్యతలు స్వీకరించాలని తెలుగుదేశం కార్యకర్తలు గట్టిగానే డిమాండ్ చేశారు.అయితే చంద్రబాబు వీటిపై ఎప్పుడు స్పందించలేదు.