తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.
అయితే ఈ పరిణమాల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. తమ మామ- టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుండా, మౌనంగా ఉండటం ఇప్పుడు సోషల్‌మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. చంద్రబాబును అరెస్టు చేసి 48 గంటలు దాటినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మౌనంగా ఉండటాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ప్రధానంగా కమ్మ సామాజికవర్గం, ఎన్టీఆర్ మౌనంపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. కనీసం జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ అధినేత అరెస్టును ట్వీట్ ద్వారానయినా ఖండిస్తారేమోనని.. టీడీపీ అభిమానులు, కమ్మ సామాజికవర్గం ఆశించింది. అయితే ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం, వారిలో ఆగ్రహానికి గురిచేసింది.