దారి తప్పిన ప్రస్తుత భారత రాజకీయానికి లోక్ సత్తా ఒక ప్రత్యమ్నాయం. దీనిని డా. జయప్రకాష్ నారాయణ స్థాపించాడు. డా.జయప్రకాష్ నారాయణ్ 1980 సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐ.ఏ.ఎస్ ఆఫీసరు. తదనంతర కాలంలో తన పదవికి రాజీనామా చేసి, లోక్ సత్తా ఉద్యమాన్ని స్థాపించాడు. లోక్ సత్తా పార్టీ 2006 అక్టోబరు 2 న స్థాపించబడింది.
దీని స్థాపకుడు డా. జయప్రకాశ్ నారాయణ్. ఇదో సాంఘిక సంక్షేమ సంస్థగా ప్రారంభమైనది. రాజకీయరంగంలో విప్లవాత్మకమైన శుద్ధ వాతావరణం తీసుకురావాలనేది సంకల్పం. ఈ సంస్థ గత తొమ్మిదేండ్లుగా తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాల సాధన కోసం ఏపీ నుంచి జయప్రకాశ్ నారాయణ పోటీ చేయాల్సిన అవసరం ఉందని కమిటీ పేర్కొంది.
తమతో కలిసివచ్చే వారితో కలిసి నూతన ఫ్రంట్ కు రూపకల్పన చేస్తామని, కలిసి పోటీ చేస్తామని వెల్లడించింది. అభివృద్ధి కోసం తపించే జేపీ వంటి వ్యక్తులను ప్రజలు ఆదరించాలని లోక్ సత్తా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.