జీవిత సత్యాలు, రాత్రి కలిసిన తర్వాత తెల్లారి పూజ చేయొచ్చా..?

భార్య భర్తల వివాహ బంధంలో ప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ఉండాలి. భర్తకి భార్య బలం కావాలి. బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి భారం కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి. సంసారం అంటే కలిసి ఉండటం కాదు కష్టాలలో కలిసిమెలిసి ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని కడవరకూ తోడు వీడకుండా ఉండడం. గొడవలు లేని బంధం కంటే గొడవపడి విడిపోకుండా ఉన్న బంధమే గొప్పది.

భార్య భర్తల మధ్య ప్రేమఅనేది చాలా ముఖ్యం. అయితే ప్రతి రోజు కాకున్నా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం. రాత్రి పూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి.. ఎలా చేయాలి పనులు అనే వాటిపై స్పష్టత ఉండదు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు. కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు కానీ.. ముందే పెళ్లి అయిన వాళ్లు కానీ ఎవరైనా సరే.. రాత్రి కలిసిన తర్వాత ఉదయమే ఏం చేయాలి అనేదానిపై అంత అవగాహన ఉండదు.

ఎందుకంటే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు. రాత్రి పూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు. నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు. పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది. ఆయనే యజమాని కాబట్టి. రాత్రి కలయిక జరిగితే, ఆ పని చేశాక ఉదయమే లేచి ఖచ్చితంగా తలస్నానం చేయాల్సి ఉంటుంది.

తలస్నానం చేసిన తర్వాతనే మిగితా పనులు చేయాలి. అది పూజ కూడా. మగవారు అయితే ఎప్పుడు పూజ చేసినా తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఆడవాళ్లు పూజలు చేస్తే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. కానీ.. మగవాళ్లు ఖచ్చితంగా చేయాలి. రాత్రి పూట ఆ పని తర్వాత ఉదయమే భర్త తలస్నానం చేసి అన్ని పనులు చేసుకోవాలి. దేవుడికి దీపం పెట్టాలి. పూజ చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *