జయప్రద సమాజ్‌వాదీ పార్టీ తరపున రాంపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆమె ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఆమె రాజకీయ రంగ ప్రవేశం తొలుత టీడీపీతో మొదైలంది. అనంతరం సమాజ్‌వాదీ పార్టీలో చేరి, ఆమె రాంపూర్ లోక్‌సభ సభ్యురాలిగా గెలిచారు. అయితే దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న జయప్రద వరుసగా సినిమాలు చేసి బాగా సంపాదించింది. అయితే వ్యక్తిగతంగా ఆర్థిక సమస్యలను ఎన్నో ఎదుర్కొంది.
తను సంపాదించుకున్న సంపాదనతో ఇన్కమ్ టాక్స్ చిక్కుల్లో చిక్కుకుంది. ఇక అప్పట్లో ఈమె సంపాదించిన సంపాదన మీద ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఆమెను టార్గెట్ చేశారు. ఇకపోతే అప్పట్లో ఒక నిర్మాత తనను కాపాడుతానని నమ్మించి, ఇన్కమ్ టాక్స్ నుంచి తప్పించి తన వలలో వేసుకున్నాడు. ఇక తనను కాపాడాడు అన్న ఉద్దేశంతో ఆ నిర్మాతతో ప్రేమలో పడింది జయప్రద . ఇక ఆ నిర్మాత ఎవరో కాదు శ్రీకాంత్ నెహతా.. ఇక అతడికి జయప్రద కంటే ముందే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ విషయం తెలియక జయప్రద అతనిని వివాహం చేసుకుంది . కానీ అసలు విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొన్ని వివాదాస్పద గొడవలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఇకపోతే ఆ బాధను, మోసాన్ని భరించలేక.. జయప్రద తన అక్క కొడుకును దత్తత తీసుకొని ఆ బాధను మరిచిపోయే ప్రయత్నం చేసింది.. తన భర్త తనను మోసం చేయడంతో తీవ్ర దుఃఖానికి గురి అయ్యింది . ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంది జయప్రద.