మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అన్నపూర్ణ స్టూడియోలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు తెలుగు తారాగణం తరలి వచ్చింది. అలనాటి నటీనటులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అయితే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలకు వచ్చిన జయసుధ, మోహన్ బాబు ఇద్దరూ కూడా పక్కపక్కనే కూర్చున్నారు. అయితే స్టేజ్ మీద ఎవరో స్పీచ్ ఇస్తుంటే బోర్ కొట్టిందో ఏమోగానీ జయసుధ ఫోన్ చూడటం మొదలుపెట్టారు. ఈ సీన్ చూసిన మోహన్ బాబుకు కోపం వచ్చింది అనుకుంటా, వెంటనే జయసుధ చేతి నుంచి ఫోన్ లాక్కున్నాడు. దీంతో సహజ నటి జయసుధకు కూడా కోపం వచ్చింది అనుకుంటా మోహన్ బాబువైపు సీరియస్ లుక్ ఇచ్చారు.
దీంతో ముందు స్పీచ్ విను అన్నట్లు ఆయన లుక్ ఇచ్చారు. ఈ సీనంతా వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇంటివారికే కాదు ఇండస్ట్రీకి మోహన్ బాబు పెదరాయుడే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరికొంత మంది వారిద్దరి మధ్య ఉన్న చనువుతోనే అలా చేశారని అందులో తప్పేం లేదని అంటున్నారు.
జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు#ANRLivesOn pic.twitter.com/wfoKg5zxWu
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2023