గత కొంతకాలంగా గుండె సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ మరణించారు. డాన్సర్ గా కెరీర్ ఆరంభించిన జయదేవి…. తర్వాత నటిగా పలు చిత్రాల్లో నటించారు. నలమ్ నలమగీయ, విలాంగు మీన్, పాశం ఒరువేషం చిత్రాలకు డైరెక్షన్ చేశారు. నిర్మాతగా మూడు చిత్రాలను నిర్మించారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ను ఇండస్ట్రీకి ఈమెనే పరిచయం చేశారు. అయితే తమిళ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ నటి, దర్శక నిర్మాత జయదేవి(65) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆమె గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటున్న సమయంలోనే కన్నుమూశారు. డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన జయదేవి పలు చిత్రాల్లో నటించింది. తర్వాత దర్శకురాలిగా మారి మలార్, నలమ్ నలమగియ, విలాంగు మీన్, పాశం ఒరువేశం లాంటి చిత్రాలను తెరకెక్కించారు.
నటిగా కొనసాగుతూనే దర్శక, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నిర్మాతగా నండ్రీ మీండుమ్, మట్రవై నేరిల్, వా ఇంద పక్కమ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని ఈమే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. జయదేవి మృతి వార్త వినగానే కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారే విషాదంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.