జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. అయితే జాన్వీ తెలుగులో ఎన్టీఆర్ సరసన ఎన్టీఆర్ 30లో నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.
ఈ మూవీ ద్వారా ఆమె తొలిసారిగా సౌత్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది జాన్వీ. కొరటాల శివ దర్శకుడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని.. జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో తన పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది.
ఈ సినిమా 2024, ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది. యువసుధ ఆర్ట్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. అది అలా ఉంటే.. జాన్వీ ఆ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో పాల్గోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇంటర్వూలో దేవర భామ జాన్వీ చేసిన కామెంట్స్ ఆ మధ్య వైరల్‌గా మారాయి.