జానీ మాస్టర్ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పాపులారిటీ అందుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీర అభిమానిగా చెప్పుకుంటూ మరింత క్రేజీ అందుకున్నారు.. అలాంటిది ఆయన వైయస్ జగన్ అభిమాని అంటూ చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే తాజాగా అటు తెలుగు ఇటు తమిళ సూపర్ స్టార్స్ కు డాన్స్ మాస్టర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఇచ్చిన కౌంటర్ వైసీపీ అధినేత జగన్ కా..లేక ఆయన పెగ్గు పుత్రుడు ఆర్జీవికా…అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు జనసైనికులు.
కొన్ని రోజులనుండి ఏపీలో జరుగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలపడానికి వచ్చిన జానీ మాస్టర్ ని తమ ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టాలని భావించిన మీడియా వారికి ఊహించని జవాబు దొరికింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు తనకి తెలుసనీ, చాల చిన్న కుటుంబం నుండి సినీ ఇండస్ట్రీకి రావడం వలన ఇటువంటు వారి కష్టాలు అర్ధం చేసుకోగలనని, వారి నిరసనలో న్యాయం ఉందంటూ వారి నిరసనలకు తానూ మద్దతిస్తున్నట్లు తెలియచేసారు జానీ మాస్టర్.
అయితే మీరు ఏపార్టీ తరుపున ఇక్కడికి వచ్చారు? రాబోయే ఎన్నికలలో ఎవరి నాయకత్వంలో పని చేయడానికి సిద్ధపడ్డారు, మీకు జగన్ అంటే ఇష్టమని జనసేన తరుపున మాట్లాడుతున్నారా? వంటి మీడియా ప్రశ్నలకు ఇలా బదులిచ్చారు.