జ్యోతిరాయ్ అంటే తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ గుప్పెడంత మనసు జగతి.. రిషి మదర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తెలుగు వారి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే గుప్పెడంత మనసు’ సీరియల్లో రిషికి తల్లి గా నటిస్తున్న జగతి హీరోయిన్ లా ఉందంటూ కాంప్లిమెంట్స్ అందుకుంటోంది.
కార్తీకదీపంలో సౌందర్య పాత్ర తర్వాత అందంగా,హుందా పాత్ర గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిది అని చెప్పొచ్చు. అందం, అభినయంతో మెప్పిస్తోన్న జగతి అసలు పేరు జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించింది. జ్యోతి రాయ్ విద్యాభ్యాసం మొత్తం పుట్టూరులోనే. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ కన్నా ముందు నిరుపమ్ హీరోగా నటించిన కన్యాదానం’లో నటించింది.
చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ‘గుప్పెడంత మనసు’లో తల్లి పాత్రలో అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులకు చేరువైంది. చిన్నప్పటినుంచి సినిమాల మీద ఉన్న శ్రద్ధ ఆమెను నటన వైపు అడుగేసేలా చేసింది. పలు కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ కి పెళ్లైంది, ఓ బాబు ఉన్నాడు.