నాలుగున్నరేళ్లలో రెండే రెండు సార్లు సిఎం హోదాలో జగన్ చేసిన పనిని రేవంత్ రెడ్డి అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మీడియాతో ముఖాముఖి మాట్లాడే విషయంలో జగన్‌ను దాటేశారు.
నాలుగున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి రెండే రెండు సార్లు ప్రెస్‌మీట్‌లలో మాట్లాడారు. అవి కూడా కోవిడ్ సమయంలో మాత్రమే ఆయన మీడియాతో నేరుగా మాట్లాడారు. 2020 మార్చిరెండో వారంలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కోవిడ్ సన్నద్ధత మీద ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు మాట్లాడారు.
కోవిడ్‌కు భయపడాల్సింది లేదు పారాసెటిమాల్‌తో తగ్గిపోతుందని, బ్లీచింగ్‌తో నియంత్రించవచ్చని అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత కూడా కోవిడ్ విషయంలోనే మరోసారి మీడియాతో మాట్లాడారు.