వైఎస్ జగన్ ప్రసంగాన్ని విన్న ప్రతిపక్ష పార్టీ నేతలు.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీచేస్తుండటంతో ఏం చేయాలో.. ఎలా ముందుకెళ్లాలో తెలియకనే ఎన్నికల ముందే ఇలా జగన్ చేతులెత్తేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు దక్కవని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు.. జగన్ అక్రమంగా సంపాదించిన సొమ్ములో రూ. 700 కోట్లు ‘సిద్ధం’ సభకు, ఫ్లెక్సీల కోసం దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. 2019 ఎన్నికల్లో పాదయాత్ర అంటూ సెంటిమెంట్ ఇప్పుడేమో..
‘గెలిపిస్తే సరే లేకుంటే నా దారి నేను చూసుకుంటాను’ అన్నట్లుగా జగన్ నోట మాటలు వస్తున్నాయని కౌంటర్లు ఇస్తున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.