ఏపీ సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్ పర్యటనకు వెళ్లారు. ఇటీవల కాలుజారి పడి, తుంటి ఎముక శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ ను పరామర్శించారు. కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఏపీ సీఎం జగన్… ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో చర్చలు ముగిసిన వెంటనే ఆయన లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడారు.