వైఎస్ జగన్ తన లండన్ పర్యటనను పూర్తి వ్యక్తిగత పర్యటనగా మలుచుకున్నారు. రాజకీయాలకు, భేటీలకు, పాలనకు పదిరోజులు విరామం ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫ్యామిలీతో నాలుగురోజులు ప్రశాంతంగా గడిపారు! ఈ పర్యటనపై “మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు” అంటూ యూకే వైసీపీ కన్వీనర్ చెప్పారంటే… జగన్ ఈ టూర్ ని ఎంత పర్సనల్ ట్రిప్ గా ప్లాన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అయితే వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో సీటు సాధించిన ఆయన పెద్ద కుమార్తె వర్ష రెడ్డిని కాలేజీలే చేర్పించేందుకు ఆయన లండన్ వెళ్లారు. ఇదే సమయంలో అక్కడ ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఓ సదస్సులో జగన్ హల్ చల్ చేశారు. వైసీపీ అధినేత జగన్ లండన్ లో సందడి చేశారు. కుమార్తె వర్ష రెడ్డి ప్రతిష్టాత్మకమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో సీటు సాధించిన సంగతి తెలిసిందే.
ప్లస్ టూలో 90 శాతం మార్కులు పైగా వచ్చిన వారికి మాత్రమే ఇక్కడ అడ్మిషన్ లభిస్తుంది. అంతేకాక యూనివర్సిటీ నిర్వహించే పరిక్ష కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ అధిగమించిన వర్షా రెడ్డి LSCలో సీటు సాధించారు. వర్ష రెడ్డిని యూనివర్సిటీలో జాయిన్ చేయించడానికి వెళ్లిన సందర్భంగా ఆయన అభిమానులు కొందరు ఓ హోటల్ లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన జగన్ కాసేపు వారితో ముచ్చటించారు. వైసీపీని అభిమానిస్తున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు పాలనపై కొన్ని విమర్శలు చేశారు. జగన్ ప్రసంగానికి అభిమానులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.